![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -31 లో.. సిరి సీతాకాంత్ ని అపార్థం చేసుకున్నందుకు తనకి సారి చెప్తుంది. ఆ అబ్బాయితో వెళ్లి కోసం నేను మాట్లాడుతాను.. ఎక్కడ ఉన్నాడని సీతాకాంత్ అడుగుతాడు. దాంతో సిరి తను ఉన్న హాస్పిటల్ అడ్రస్ చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి, వాళ్ళ అమ్మ సుజాత, చెల్లి పింకీలు ధన దగ్గరికి వచ్చి ఎమోషనల్ అవుతారు.
ఆ తర్వాత నీకు ఈ దెబ్బలతో ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది అనుకోకు.. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోనంత వరకు నువ్వు ప్రాబ్లమ్ లో ఉన్నట్లేనని ధనని రామలక్ష్మి హెచ్చరిస్తుంది. అప్పుడే మాణిక్యం వస్తాడు. డాక్టర్ కూడా వస్తాడు. త్వరగా డిశ్చార్జ్ చెయ్యండని డాక్టర్ కి రామలక్ష్మి చెప్తుంది. ఏంటి డబ్బులు అవుతాయని అలా అంటున్నావా.. నేను ఉన్నాను నేను చూసుకుంటానని మాణిక్యం అనగానే.. హా చూసుకుంటావ్ లే గాని అంటు మాణిక్యంపై సుజాత కోప్పడుతుంది. ఆ తర్వాత ధన ని డిశ్చార్జ్ చేస్తారు. మీరు ధనని తీసుకొని ఇంటికి వెళ్ళండి. నేను టాబ్లెట్ తీసుకొని వస్తానని రామలక్ష్మి తన వాళ్ళకి చెప్తుంది. అపుడే సీతాకాంత్ ధన కోసం హాస్పిటల్ కి వస్తాడు. ధనని మాణిక్యం తీసుకొని వెళ్తుంటే సీతాకాంత్ చూసి షాక్ అవుతాడు. సిరి ప్రేమించిన అబ్బాయి మాణిక్యం కొడుకా అని అనుకుని.. మాణిక్యం మళ్ళీ ప్లాన్ తో వచ్చావా అంటు వాళ్ళు వెళ్తాన్న అటో వెనకాలే పరిగెడతాడు. సీతాకాంత్ పరిగెత్తడం చూసి రామలక్ష్మి కూడా వెనకాలే వెళ్తుంది. ఒరేయ్ మాణిక్యం తప్పించుకున్నావ్ అని సీతాకాంత్ గట్టిగా అరుస్తుంటాడు. తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ధన అనే అబ్బాయి ఇంటి అడ్రస్ కనుక్కొని ఆ మాణిక్యం గాన్ని తీసుకొని రా అని సీతాకాంత్ చెప్తాడు. ఇక అక్కడే వెనకాల ఉన్న రామలక్ష్మి అది విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఎవరు సర్ ఈ మాణిక్యమని అడుగుతుంది. ఒక మోసగాడు అంటూ చెప్తాడు. వాడిని వదిలి పెట్టానని సీతాకాంత్ అంటాడు. మాణిక్యం గురించి చెప్పబోతుంటే అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చెయ్యడంతో సీతాకాంత్ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత నాన్న గతంలో ఉన్నది వీళ్ళ కుటుంబమేనా.. మరి నాన్న ఒకరకంగా చెప్పారు.. సర్ ఒకరకంగా చెప్పారని రామలక్ష్మి అనుకొని ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ సుజాత వచ్చి.. మీ నాన్నని ఎవరో తీసుకొని వెళ్లారని చెప్పగానే.. నేను కనుక్కుంటానని రామలక్ష్మి వెళ్తుంది. మరొకవైపు మాణిక్యాన్ని తన ఫ్రెండ్స్ సీతాకాంత్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |